ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ పథకం,నగదు బదిలీ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు జగన్ తెలిపారు. 30 నుంచి 35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేదని తెలిపారు. బాబు మిగిల్చిన ఎనిమిదివేల కోట్ల బకాయిలు తమ ప్రభుత్వం తెరుస్తుందన్నారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా ఇస్తామని,ఆ ఖాతాలో డబ్బులు కూడా ప్రభుత్వం వేస్తుందని జగన్ తెలిపారు. ఆ డబ్బు రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని ఇకపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.