రాష్ట్రంలో ‘రివర్స్’ పాలన నడుస్తుండటంతో ఆల్రెడీ వచ్చిన కంపెనీలే తిరుగుబాట పడుతున్నాయని ప్రతిపక్షం ఓపక్క గగ్గోలు పెడుతుంటే ప్రాన్స్ నుంచి వచ్చిన ఒక వాణిజ్య ప్రతినిధి బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందంటూ అందిన వార్త బెజవాడ టెంపరేచర్‌ను చంద్రబాబు తగ్గిస్తానన్నంత చల్లగా వినిపించింది. ఇంతకీ వచ్చిన ఈ ఫ్రాన్స్ బృందం ఎవరూ ఏమిటీ అని ఆరా తీస్తే తీరా బయటపడ్డ ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే…
13 మంది పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్ నుంచి వచ్చి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ బృందం ఆసక్తి చూపించిందని సీఎంవో నుంచి వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ట్వీట్ కూడా చేసుకుంది. అబ్బో.. ఎంత మంచి శుభవార్త.. అని జనం ఉప్పొంగిపోయారు. నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం లైన్లో పడుతుందని అందరూ అశాభావంతో వున్నారు. ఇంతలో అసలు నిజం ఒకటి బయటపడింది. తీగ పట్టుకుని డొంక లాగిన పరిశీలకులకు అసలు మేటర్ అర్ధమైంది. ఆ వచ్చింది మరెవరో కాదు, మన ‘భారతీ సిమెంట్’ కొన్న ఫ్రాన్స్ కంపెనీ వాళ్లు..!
ఫ్రాన్స్ ప్రతినిధి బృందంలో వచ్చిన ఒకావిడ పేరు సోఫీ సిడాస్. ఈ వార్త అడుగున ఇచ్చిన ట్వీట్ వుంది చూశారూ.. అది ఈవిడ చేసిన ట్వీటే. ఈవిడది vicat అనే ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీ. ఈ కంపెనీయే జగన్ కుటుంబ సంస్థ ‘భారతి సిమెంట్స్’ కొన్నది. అన్నట్టు ఇప్పుడు భారతి సిమెంట్స్ vicat గ్రూప్‌లో భాగమే.