ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్… ఇతర దేశాల్లో మాత్రం మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలో యూరప్ కూడా ఉంది. అక్కడ ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ కమ్రంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.
మాక్రాన్‌కు కరోనా సోకినట్టు అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్ ప్రకటించింది. ఏడు రోజుల పాటు ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని తెలిపింది. కాగా మాక్రాన్ అధ్యక్ష భవనం నుంచే పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌లో మాక్రాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ తేలినట్టుగా గుర్తించారు.