వామ్మో పోలీస్, పోలీస్ లతో జాగ్రత్తగా ఉండాలి, పోలీస్ ల చేతిలో పడితే ఇక అంతే, ఖాకి చొక్క చూస్తేనే వనికిపోయే వాళ్ళు ఉన్నారు. దీనికి కొందరు పోలీస్ లు కూడా కారణమే, అలాగని అందరూ అలాంటి వాళ్ళు కారు అందులో చాలామంది మంచి పోలీస్ లు కూడా ఉంటారు అనేది నిజం. ఖాకీ చొక్కా వెనుక కరుకైన హృదయమే కాదు కారుణ్యం కూ డా ఉంటుందని కొందరు పోలీస్ లను చూస్తే అర్థం అవుతోంది. కర్ణాటక రాష్ట్రం లోని ఆ డుగొడి పోలీస్ స్టేషన్ లో సీఐ దిలీప్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన సురేశ్ అనే యువకుడు ఇటీవల విడుదలైన సాహో చిత్రాన్ని చూడడానికి ఓక సినిమా థియేటర్‌కు వెళ్లాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సురేష్ దగ్గర తినడానికే డబ్బులు లేవు కానీ ప్రభాస్ అంటే పిచ్చి అభిమానం. తన అభిమాన హీరో సినిమా ఎలాగైనా చూడాలి అనుకున్నాడు కానీ టికెట్ కు డబ్బులు లేవు, దాంతో టికెట్ లేకుండా థియేటర్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అడ్డుకున్న సిబ్బంది సురేశ్‌ను అడుగోడి పోలీసులకు అప్పగించారు. దీంతో సీఐ దిలీప్ సురేశ్‌ను వివరాలు అడగ్గా కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వచ్చానని, అయితే ఎక్కడా పని లభించకపోవడంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని వివరించాడు. తెలుగు హీరో ప్రభాస్‌కు అభిమానని అందుకే సాహో సినిమా చూడడానికి థియేటర్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించానని తెలిపాడు. సురేశ్ పరిస్థితి తెలుసుకున్న సీఐ దిలీప్ అదే స్టేషన్‌లో హౌస్ కీపింగ్‌తో పాటు ఓ హోటల్‌లో కూడా పని ఇప్పించారు. మాములుగా అయితే స్టేషన్ కు తీసుకెళ్లి సాయంత్రాం దాకా సెల్ లో కూర్చోబెట్టి వదిలేస్తారు. కానీ సీఐ దిలీప్ మాత్రం పెద్దమనుసుతో ఆలోచించి అతడు తప్పు చేయడానికి కారణం కనుక్కుని తన వంతు సహాయం చేయడాన్ని అందరూ అభినందిస్తున్నారు.