హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడాలో మర్డర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ మర్డర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఈ మర్డర్ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సాయినాథ్ ని చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయినాథ్ ని తోటి ముగ్గురు స్నేహితులే నరికి చంపినట్లుగా గుర్తించారు. ఆర్థిక కారణాలతోనే సాయినాథ్ ని చంపినట్టుగా పోలీసులు నిర్థారించారు.
జియాగూడలో జంగం సాయినాథ్ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం టూ వీలర్ పై పురానాపూల్ నుంచి జియాగూడకు బయలు దేశారు. ఈ క్రమంలో పీల్ మండవ్ శివాలయం సమీపంలోకి సాయినాథ్ చేరుకోగానే.. ముగ్గురు నిందితులు ఒక్కసారిగా అతడి వాహనానికి అడ్డం వచ్చారు. అనంతరం కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో ముగ్గురు మూకుమ్మడిగా అతడి మీద దాడి చేశారు. అదే సమయంలో గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్థన్ టూవీలర్ వస్తున్నాడు.
ఈ దారుణాన్ని దూరం నుంచే గమనించి.. కేకలు వేయడంతో గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయినాథ్ ని చంపుతున్నా ఎవరూ అడ్డుకోలేదని, మనకెందుకు అని వెళ్లిపోయారని అన్నారు. అడ్డుకోవడానికి భయమైనతే డయల్ 100కి అయినా ఫోన్ చేయాల్సిందన్నారు.