అబ్దుల్లాపూర్‌మెట్ లో ప్రియురాలి కోసం స్నేహితుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే కర్నూలులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా జనవరిలో ఈ హత్య జరగగా తాజాగా బయటకు వచ్చింది. కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి నగ్న వీడియోలను డౌన్లోడ్ చేసుకుని ఆమె ను బ్లాక్ మెయిల్ చేశాడు.
మురళీకృష్ణ వేధింపులు భరించలేక సూసైడ్ ఆటెంప్ట్ చేసింది యువతి.విషయం తెలిసిన మురళీ స్నేహితుడు, యువతి ప్రియుడు దినేష్ కుమార్ మురళీ హత్యకు ప్లాన్ చేశాడు. దీనికి దినేష్ మరో స్నేహితుడు కిరణ్ కూడా సహకరించాడు.
జనవరి 25న పంచలింగాల దగ్గరకు తీసుకువెళ్లి గుండెలో కత్తితో పొడిచి మురళీ కృష్ణను చంపేశారు దినేష్ కుమార్ అతని స్నేహితుడు కిరణ్ కుమార్. మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు . తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీకృష్ణ తల్లి దండ్రులు.
ఇక పోలీసుల దర్యాప్తుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కి.మీ మేర గాలించారు పోలీసులు. మురళీకృష్ణ మృతదేహం ఇంకా దొరకలేదు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.