ఢిల్లీ జె.ఎన్.యు లో విద్యార్ధులపై దాడి తమ పనేనని హిందూ రక్ష దళ్ ప్రకటించింది. యూనవర్సిటీలో దాడి చేసింది తమ కార్యకర్తలేనని..దానికి తమదే పూర్తి బాధ్యతని ఆ సంస్థ కు చెందిన పింకీ చౌదరి ప్రకటించారు. ” జాతి విద్రోహ శక్తులకు జె.ఎన్.యు కేంద్రంగా మారింది…మేము దీన్ని సహించం…అందుకే జె.ఎన్.యులో విద్యార్ధులపై దాడి చేశాం…దాడి చేసిన వాళ్లు మా కార్యకర్తలే” నంటూ ఓ మీడియా సంస్థకు తెలిపారు. అయితే బీజేపీ అనుబంధ విద్యార్ది సంఘం ఏబీవీపీ కార్యకర్తలను ఈ కేసులో నుంచి తప్పించడానికే మత సంస్థను ముందుకు తీసుకొచ్చారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
విద్యార్ధులపై దాడి చేసింది తామేనంటూ హిందూ రక్షా దళ్ పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. మారణాయుధాలతో ముసుగులు ధరించి వచ్చి దాడి చేసిన వారిని గుర్తించడానికి పోలీసులు ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి పలు వీడియో క్లిప్పులను పరీక్షిస్తున్నారు. వీడియోలో కొన్ని క్లిప్పుల్లో ఏబీవీపీ విద్యార్దులు కూడా కనిపిస్తున్నారు. జె.ఎన్.యు ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన ఏబీవీపి విద్యార్ధి వికాస్ పటేల్ లాఠీలు పట్టుకొని ఉన్న డజన్ మంది యువకుల మధ్య నిల్చున్నాడు.
Advertisements