టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ లకు క్లీన్ చీట్ లభించింది. 2017లో వారి నుండి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్లు పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్… వారు డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవని తేల్చింది.
ఎక్సైజ్ శాఖ విచారణ సందర్భంగా 2017లో రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారి నుండి నమూనాలను సేకరించింది. గతేడాది డిసెంబర్ 8న ఎక్సైజ్ శాఖ ఈ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మాలన్ని కూడా కోర్టుకు సమర్పించింది.
ప్రస్తుతం ఇదే కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా… డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హజరయ్యారు.