ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఇంధన ధరల పెంపు అత్యంత తక్కువగా ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్ ధరలు కేవలం 30శాతం మాత్రమే పెరిగాయన్నారు.
కానీ పెట్రోల్ ధరలు 80శాతం పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అందులో వాస్తవం లేదన్నారు. దేశం ఇంకా కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతోందన్నారు. అయినప్పటికీ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ను కేంద్రం ఇస్తోందన్నారు.
అందరికీ కరోనా వ్యాక్సిన్ ను తమ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలపై బ్యారెల్ కు 19.56 డాలర్ల నుంచి 130 డాలర్ల వరకు పెరిగినట్టు ఆయన వివరించారు.
బీజేపీయేతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు సగం వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయని అన్నారు. గతంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం రూ.32 ఎక్సైజ్ సుంకం విధించేదని, దానిని తగ్గించామని చెప్పారు. పెట్రోల్ ధరల విషయంలో ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేస్తున్నాయని, వారు ఎన్ని ఆరోపణలు చేసినా వాస్తవం మాత్రం మారదన్నారు.