దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80పైసలను చమురు కంపెనీలు శనివారం పెంచాయి. గత 12 రోజుల్లో వాటి ధరలు పెరగడం వరుసగా ఇది పదవసారి కావడం గమనార్హం.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.61గా ఉంది. డీజిల్ ధర రూ. 93.87కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలపై 85పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ 117.57, డీజిల్ ధర రూ. 101.79కు చేరింంది.
దేశంలో గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ ఏడాది మార్చి 22 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.
ఇక అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి పెంపూ చేయలేదు. కాస్త ఉపశమనం దొరికిందనుకునే లోగా శనివారం మళ్లీ ధరలు పెంచారు. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు మొత్తం రూ. 7.20 పెరిగాయి.