వాహనదారులపై చమురు కంపెనీలకు కరుణే లేకుండా పోయింది. ఇంధన ధరలు వంద దిశగా నాన్‌స్టాప్ పరుగులు పెడుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై డీజిల్‌పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90.93కు చేరింది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ .81.32కు పెరిగింది. అటు ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర వందకు అత్యంత చేరువలో ఉంది. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ లీటర్‌కు రూ.97.34పలుకుతోంది. డీజిల్ రూ.88.44గా ఉంది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పెట్రోల్ లీటర్ రూ.94.54, డీజిల్ రూ.88.69కు చేరింది. మొన్నటి వరకు వరుసగా 13 రోజుల పాటు కంటిన్యూగా చార్జీలు పెరగ్గా.. ఆది, సోమవారం బ్రేక్ ఇచ్చాయి. మళ్లీ ఇవాళ బాదేశాయి చమురు కంపెనీలు. ఫిబ్రవరి నెలలోనే ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు 15 సార్లు పెరిగాయి.