కోరనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించటంతో రెస్టారెంట్స్, హోటల్స్ మూతపడ్డాయి. దీంతో బయటి ఫుడ్ కు అలవాటైన జనం హోం మేడ్ ఫుడ్ తో అడ్జెస్ట్ కాక తప్పలేదు. కానీ తాజాగా ఇచ్చిన సడలింపులతో హోం డెలివరీ సదుపాయం వచ్చింది. హోటల్స్, రెస్టారెంట్స్ హోం డెలివరీతో పాటు జొమాటో, స్విగ్గీ సంస్థలు ఆన్ లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.
అయితే… లాక్ డౌన్ సడలింపులతో ఫుడ్ ఆర్డర్స్ పెరిగాయి. కానీ ఈ ఆర్డర్స్ లో ఎక్కువ శాతం జనం బిర్యానీ ఆర్డర్స్ చేస్తున్నారట. చాలా కాలంగా జనం బిర్యానీకి దూరంగా ఉండటంతో ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీకి మంచి గిరాకి ఏర్పడిందట. కానీ గతంలో మాదిరిగా చిన్న చిన్న రెస్టారెంట్స్, కిచన్స్ నుండి కాకుండా పేరున్న రెస్టారెంట్స్ కే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయట.
అయితే… వలస కూలీలు, ఇతర రాష్ట్రాల వారు సొంతూళ్లకు వెళ్లిపోవటంతో చాలా రెస్టారెంట్స్ లో తక్కువ మ్యాన్ పవర్స్ తో పనిచేస్తున్నాయట. ఇక ఈ బాధ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటోలకు కూడా తాకింది. ఇప్పటికే ఈ కంపెనీలు తమ స్టాఫ్ ను తగ్గించుకోగా, డెలివరీ బాయ్స్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపటం లేదని తెలుస్తోంది. దీంతో ఆర్డర్స్ పెరుగుతున్నాయని డెలివరీ బాయ్స్ అంటున్నారు.
మొదటి రెండు రోజులు జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా… క్రమంగా ఆర్డర్స్ పెరుగుతున్నాయని, అయితే ఈ ఆర్డర్స్ కూడా బేగంపేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, నాంపల్లి, అమీర్ పేట ఏరియాల్లో ఎక్కువగా ఉన్నట్లు ఆయా హోటల్స్ ప్రతినిధులు చెబుతున్నారు.