తెలుగులో సీక్వెల్స్ సినిమాలు పెద్దగా ఆడవన్న అభిప్రాయం ఉన్నా… ఎఫ్-2 టైంలోనే సీక్వెల్ చేస్తానని ప్రకటించిన దర్శకుడు అనిల్ రావిపూడి. అనుకున్నట్లే వచ్చే వారం నుండి ఎఫ్-3 సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇందులోనూ వెంకటేష్, వరుణ్ తేజ్ ల సరసన… తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. అయితే, ఈ మూవీలో రెండు కీలక పాత్రల కోసం మరో ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. పైగా ఓ ఐటెం సాంగ్ కూడా పెట్టబోతున్నారట. అంటే ఎఫ్-3లో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ అన్నమాట.
ఎఫ్-2ను మించి నవ్విస్తానని ఇప్పటికే ప్రకటించిన దర్శకుడు, ఇప్పుడు గ్లామర్ డోస్ కూడా పెంచేస్తే…. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.