హైదరాబాద్ లో వానలు దండికొడుతున్నాయి. రోడ్లన్ని వాగుల్లా పారుతున్నాయి. దాదాపు నడుము లోతు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో… నగర జీవనం అస్తవ్యస్తంగా తయారవుతోంది. హైదరాబాద్ యూసుఫ్ గూడ శ్రీనగర్ కాలనీలో వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరచి ఉన్నాయో తెలియని పరిస్థితులున్నాయి. అయితే, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటోంది జీహెచ్ఎంసీ.