పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా కేజీఎఫ్ తో సంచలన హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా కావటంతో భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ సింగరేణి కోల్ మైన్స్ లో సాగుతుంది. ప్రభాస్ గోదావరిఖని గెస్ట్ హౌజ్ లో ఉంటున్నారు.
అయితే, ప్రభాస్ షూటింగ్ సింగరేణిలో సాగుతుందని తెలియగానే అభిమానుల తాకిడి భారీగా పెరిగిందట. దీంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక… నిర్వాహకులు పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ గెస్ట్ హౌజ్ వద్ద కూడా ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సలార్ మూవీ 2022 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.