జపాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన యెషిహిదే సుగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో తర్వాత పీఎం ఎవరనే ఓటింగ్ జరగ్గా ఎక్కువమంది ఫుమియో కిషిడాకే జై కొట్టారు.
సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా కొనసాగిన షింబో అబే అనారోగ్య సమస్యలతో తప్పుకోవడంతో పీఎం పదవి సుగాను వరించింది. అయితే అది ఎంతోకాలం నిలువలేదు. ఏడాదికే ఆయనకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తం అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా కట్టడిలో సుగా ఫెయిల్ అయ్యారనే విమర్శలు ఉన్నాయి. పైగా అదే సమయంలో ఒలింపిక్స్ జరగడం కూడా ఆయనంటే ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.
Advertisements
రోజురోజుకీ తన గ్రాఫ్ డౌన్ అవుతుందని గ్రహించిన సుగా.. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కిషిదాను పీఎంగా ఎన్నుకున్నారు. వచ్చేవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.