రాజధాని రైతులకు ఊరట..
రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు 187.44 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం…
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు కౌలు డబ్బులు విడుదల చేసింది. రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేసింది. రాజధాని రైతులకు కౌలు చెల్లించేందుకు సీఆర్డీఏ, మున్సిపల్ శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కౌలు చెల్లించాలంటూ గత కొద్దిరోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతు కూడా లభించడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో తక్షణమే రైతులకు కౌలు చెల్లించే ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత శాఖ మంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.