ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. హాలీవుడ్ ప్రముఖులను సైతం మెప్పించింది. తెలుగు చిత్ర సీమకు ఎన్నో సంవత్సరాల కలగా ఉన్న ఆస్కార్ అవార్డుని పట్టుకుని వచ్చేసింది.
ఇప్పటికే ఈ పాట గురించి హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులెందరో ప్రస్తావించారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ అయితే తన కుమారుడు ఈ పాట పెడితే కానీ అన్నం తినడు అని స్వయంగా ప్రకటించింది. అంత క్రేజ్ ఉన్న పాట ఇప్పుడు జీ20 సదస్సులోకి వెళ్లింది. ఇండియా జీ20 ప్రెసిడెన్సీలో 2వ వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశం బుధవారం నాడు చండీగఢ్‌లో ప్రారంభమైంది.
ఈ సమయంలో సమావేశాలకు హాజరైన జీ20 ప్రతినిధులు అంతా కలిసి నాటు నాటు అంటూ డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో సందడి చేస్తుంది.
కాగా నాటు నాటు పాట 95 వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ ను గెలుచుకున్నప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో దీనికి స్టేప్పులేస్తున్నారు.