చిన్న సినిమాలకు పెద్ద నిర్మాతలు అండగా నిలుస్తూ… ఓవైపు ఎంకరేజ్ చేస్తూనే మరోవైపు ఫైనాన్సియల్‌గానూ లాభపడుతున్నారు. ఈ వరుసలో ముందుంటారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. చిన్న సినిమాలుగా వచ్చి మంచి హిట్ కొట్టిన పెళ్లిచూపులు, కేరాఫ్ కంచెరపాలెం, రాజావారు రాణిగారు లాంటి సినిమాలను సురేష్ ప్రొడక్షన్స్ ఇలా రిలీజ్ చేసిందే. తాజాగా సురేష్‌బాబుకు పోటీగా రంగంలోకి దిగారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.
శ్రీకాకుళం జిల్లా పలాసలో 1978లో జరిగిన యాధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం పలాస. క్రైమ్ థ్రిల్లర్ పలాస చిత్రాన్ని జీఏటూ పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి రిలీజ్ చేయబోతున్నాయి. ఇప్పటికే పలాస చిత్రాన్ని చూసిన అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలు… ఇంప్రెస్ అయి మూవీని తమ బ్యానర్‌పై రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. జనవరి చివర్లో ఈ చిత్రం రిలీజ్ ఉండే అవకాశం ఉంది.
కరణ్ కుమార్ దర్శకత్వంలో ద్యాన్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రఘు కుంచె సంగీతం అందించగా… రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు.