అనిష్ దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ప్రేక్షకులను ముందుకు రాబోతున్న చిత్రం గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా మార్చి 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు.
అంతేకాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను కూడా అందించడం విశేషం. ఇక శ్రీ విష్ణు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.