శనివారం ఉదయం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదంలో పై నుంచి కిందకు అమాంతంగా కారు పడిన సంగతి తెలిసిందే. అయితే అతివేగం తో పాటు, ఫ్లైఓవర్ పై మలువు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ను సైబరాబాద్ పోలీసులు మూసివేశారు. ప్రమాదం పై తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫ్లైఓవర్ పై రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మరో వైపు ఫ్లైఓవర్ నిర్మించి నెల రోజులు కాకముందే మూడు ప్రమాదాలు జరగటంతో వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో జరిగిన పొరపాటుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.