గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను నెలరోజుల్లోపు ఖాళీ చేయాలని, బాట సింగారం సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫ్రూట్ మార్కెట్ కు వెళ్లాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఉన్నఫలంగా మార్కెట్ ఖాళీ చేయటం కుదరదని, అక్కడ సరైన వసుతుల కూడా లేవని వ్యాపారులు కోర్టుకు విన్నవించారు.
అయితే, తాత్కాలిక మార్కెట్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు కోల్డ్ స్టోరేజ్ లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టు ముందు తెలిపింది. వ్యాపారులు కోరిన విధంగా స్టే ఇవ్వకూడదని తెలిపింది.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.