నా పార్టీని కేసీఆర్ కబ్జా చేశాడని ఆరోపించారు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య. తెలంగాణ ప్రజలు నాలాంటి చాలా మంది ఉద్యమకారులను తిడుతున్నారని, తెలంగాణ సాధించి కేసీఆర్ లాంటి నియంత చేతిలో పెట్టాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనకోసం తాను ప్రారంభించిన పార్టీని, జెండాను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు డిస్మిస్ చేసే హక్కు కేసీఆర్ కు లేదు అన్నారు. ఆర్టీసీ కార్మికులపై గెలిచాను అని కేసీఆర్ సంబరపడుతుండొచ్చు కానీ అదే సమ్మె కేసీఆర్ పతనానికి నాంది పాలికిందని అన్నారు.
తాను మూడు రకాల జీవితాలు అనుభవించనని, నక్సలైట్ గా ఉన్నప్పుడు పార్టీ ఆదేశాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేశానని, వాటి వల్ల తాను ఒక చెయ్యి ని కూడా కోల్పోయనని చెప్పారు. ఆ తరువాత తెలంగాణ సాధనకోసం ఉద్యమం చేశామని, తెలంగాణ సాధించిన సంతృప్తి అయితే లేదు అన్నారు. ఇప్పుడు అనాధాల హక్కులకోసం పోరాడుతున్న అని అన్నింటికన్నా ఇదే సంతృప్తిని ఇస్తుందని అన్నారు. 150 మంది అనాధలకు ఆశ్రమం కలిపించి వాళ్ళను చదివిస్తున్న అని అదే ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.
ఒకప్పుడు ఆంధ్ర దోపిడిదారులు దోచుకుంటే ఇప్పుడు తెలంగాణ దోపిడిదారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు మరొక ఉద్యమానికి సిద్ధం అవుతున్నామని గాదె ఇన్నయ్య అన్నారు.
తొలివెలుగులో గాదె ఇన్నయ్యతో ముఖాముఖి విత్ జీఎన్నార్…