గజ్వేల్ సభ తెలంగాణలోనే కాదు.. యావత్ దేశ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సమీపంలో ఏ ఎన్నికలు లేకపోయినా… ఓ బహిరంగ సభకు కార్యకర్తలు దండులా కదలి రావడాన్ని చూసి జాతీయ నేతలు సైతం పులకించిపోతున్నారు. ఇసుకేస్తే కూడా రాలదేమోనన్నట్టుగా తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానసందోహ దృశ్యాలను రీ ప్లేలు చేసి మరీ చూసి మురిసిపోతున్నారు. గజ్వేల్ సభ దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా తాము కూడా పంచుకుంటూ.. పునర్వైభవం వస్తోందని సంతోషపడుతున్నారు.
సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఏదైనా బహిరంగ సభ నిర్వహిస్తే.. అందుకు సంబంధించిన వివరాలను ఇతర రాష్ట్రాల నాయకులు పెద్దగా పట్టించుకోరు..పంచుకోరు. ఒకవేళ ఆ మీటింగ్‌కు తమ అగ్రనేతలు రాహుల్, సోనియా వంటి నేతలు హాజరైతే మాత్రం.. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాలు వాటి తాలూకు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాయి. కానీ గజ్వేల్ సభ కాంగ్రెస్‌లో కొత్త సంస్కృతికి బీజం వేసినట్టయింది.
తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సంబురంగా కదిలిరావడాన్ని చూసి.. ఇతర రాష్ట్రాల నేతలు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. తెలంగాణ నాయకత్వాన్ని ప్రశంసల్లో ముంచేస్తున్నారు. మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే నేతలను ట్యాగ్ చేస్తూ.. వెల్ డన్ అంటూ పొగిడేస్తున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవం పోసుకుంటోందని.. అందుకు ఇదే సాక్ష్యమని గజ్వేల్ సభను హైలెట్ చేస్తున్నారు. మరోవైపు తాజా సభ సక్సెస్‌తో రేవంత్ రెడ్డి క్రేజ్ నేషనల్ లెవెల్‌లో మరింత పెరిగిపోయింది. చాలా మంది ఢిల్లీ స్థాయి నేతలు ఫోన్లు చేసి శుభాకాంక్షలు, అభినందనలతో ఆయన్ను ముంచెత్తుతున్నారు.
Credit goes to you and Congress workers @INCTelangana https://t.co/ykFyMxiGR1
— Dr Md Jawaid (@DrMdJawaid1) September 17, 2021
Very impressive @revanth_anumula brother. Keep up the good work, am sure under your able leadership we will grow much stronger in Telangana. Jay Congress #StrongerTogether @INCTelangana @manickamtagore https://t.co/6uQLQ6zpRs
— Saptagiri Ulaka (@saptagiriulaka) September 17, 2021
CONGRESS FOR TELANGANA! https://t.co/jZ8eJCKGfM
— Saral Patel (@SaralPatel) September 17, 2021
These huge crowds attending @revanth_anumula s rally in the Stronghold of KCR is testimony to the fact that Congress is going to form the next govt in #Telangana ..#ChaloGajwel pic.twitter.com/ICcLhKDgk3
— Vinay Kumar Dokania (@VinayDokania) September 17, 2021
Advertisements