డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మిగిలిన వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే.. వారిలో యంగ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గల్లా ఫ్యామిలీ వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారంలో అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాకు తెలిపింది. దయచేసి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని గల్లా ఫ్యామిలీ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.
మరోవైపు నటి హేమ పేరు కూడా ఈ పబ్ వ్యవహారంలో వినిపించింది. అయితే.. తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు తెలిపింది. ఓ ఛానల్ పదే పదే తన పేరును హైలెట్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.
ఆదివారం ఉదయం ర్యాడిసన్ బ్లూపై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు. యజమాని సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు.