కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు. అయితే వైరస్ నుంచి కోలుకున్నాక కూడా కొందరు ఆరోగ్య సమస్యలకు గురికావడం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. బ్లాక్ ఫంగస్ అని కొందరు.. కిడ్నీ ప్రాబ్లమ్స్ అని మరికొందరు.. తాజాగా కరోనా తగ్గినవారికి పిత్తాశయ సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఇప్పటిదాకా ఐదుగురిలో దీన్ని గుర్తించారు.
ఈ ఐదుగురు రోగులకు కరోనా వచ్చి తగ్గినట్లు తెలిపారు డాక్టర్లు. జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐదుగురిలో పిత్తాశయ సమస్య రావడం గుర్తించామని చెప్పారు. అత్యవసర సర్జరీ కూడా చేసినట్లు వివరించారు. ఐదుగురిలో నలుగురు పురుషులు కాగా.. ఒకరు మహిళ. అందరిలో కామన్ గా పొట్టలో విపరీతమైన నొప్పి, జ్వరం ఉనట్లు చెప్పారు డాక్టర్లు. ముగ్గురికి స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు.
నిజానికి నార్త్ ఇండియాలో చాలామందికి పిత్తాశయంలో రాళ్ల సమస్య ఎదురవుతుంటుంది. అయితే ఈ ఐదుగురిలో మాత్రం తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు వైద్యులు.