సందీప్ కిషన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గల్లీ రౌడీ. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది. కోన వెంకట్ మరియు ఎంవివి సత్య నారాయణ ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమాస్ పై నిర్మించారు.