ఐపీఎల్ 2022 సీజన్ 15 తుది పోరు ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. మొదటి సీజన్ లోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరింది. బుధవారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్ ఎలిమినేటర్ లో బెంగళూరు చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది.
అయితే.. ఈ మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో మాట్లాడారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న గంభీర్.. ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యారు. రాహుల్ తో కూడా చాలా విచారకరంగా మాట్లాడారు.
ఈ నేపథ్యంలో రాహుల్ తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో గంభీర్.. రాహుల్ కు చివాట్లు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. దాంతో నెటిజన్లు ఫన్నీ క్యాప్షన్స్ తో నవ్వులు పూయిస్తున్నారు.
‘ఓడిపోయినందుకు సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? క్యాచ్ లు వదలవద్దని ఒక్కొక్కడికి ముద్దుగా చెప్పానుస అని గంభీర్ చివాట్లు పెడుతున్నాడని ఫన్నీ క్యాప్షన్ లు ఇస్తున్నారు.