రేవంత్ రెడ్డి పనులు, ఆలోచనలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి. ఎవరు ఊహించని రీతిలో పనులు చేస్తుంటారు.మిగతా నేతలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ గాంధీభవన్ కు వెళ్ళింది మాత్రం వేళ్ళ మీద లెక్కించోచ్చు, వి హనుమంతరావు లాంటి వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి RSS మనిషి, కాంగ్రెస్ భావజాలం లేదు అని కూడా విమర్శలు చేశారు.కొందరు నేతలు గాంధీభవన్ లో కూర్చొని ప్రతివిషయనికి ప్రెస్ మీట్ పెడుతుంటారు. రేవంత్ మాత్రం గాంధీభవన్ కు వెళ్లడం చాలా అరుదు. రేవంత్ రెడ్డి పై ఎప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తోంది, అతను ఏ పనిచేసిన ప్రశంషలతో పాటు ఆదేస్తాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. రేవంత్ ను ప్రోత్సహించవద్దని దాని వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని, తొందరలోనే రేవంత్ కొత్త పార్టీ పెడతారని, పీసీసీ ఇచ్చిన బయటకు వెళ్లి కొత్త పార్టీ పెడతారని ఇలా విమర్శలు ఆయనను చుట్టుముడుతుంటాయి. తన మీద వస్తున్న విమర్శలకు రేవంత్ చెక్ పెట్టారు, ఆ ఒక్క పనిద్వార కాంగ్రెస్ అంటే ఎంత ఇష్టం, కాంగ్రెస్ మనుషులు అంటే ఎంత గౌరవమో చెప్పారు రేవంత్..
తొలివేలుగు కథనం
రేవంత్ కు తెలంగాణ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది, తన అభిమానులు తెలంగాణ పులి అని పిలుచుకుంటారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటికి ప్రతిరోజు వందలమంది అభిమానులు వస్తుంటారు. ఆ ఇళ్ళు చిన్నగా ఉండడం తో ప్రత్యేకంగా అభిమానులు కలవడానికి ఒక ఆఫీస్ ను నిర్మించాలనుకున్నారు రేవంత్, అప్పటినుంచి రేవంత్ వ్యతిరేకులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు, రేవంత్ కొత్త ఆఫీస్ కట్టుకుంటున్నాడు ఇక కొత్త పార్టీ పెడతారని పెద్దఎత్తున ప్రచారం చేశారు. విమర్శలపై ఎప్పుడు స్పందించని రేవంత్ తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వాటన్నింటికి చెక్ పెట్టారు. సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ సిద్దించిన రోజు పార్టీ ఆఫీస్ ను ప్రారంభించడమే కాకుండా దాన్ని గాంధీభవన్ లో 40 సంవత్సరాలుగా అటెండర్ గా పనిచేస్తున్న షబ్బీర్ అనే వ్యక్తితో ప్రారంభోత్సవం చేయించారు. 40 ఈయర్స్ ఇండస్ట్రీ నేతలు ఏ రోజు గాంధీభవన్ లో పనిచేస్తున్న వాళ్లకు గౌరవం ఇవ్వలేదు అదే రేవంత్ తన ఆఫీస్ ను వాళ్ళతో ప్రారంభోత్సవం చేయించారు, దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలి అంటున్నారు రేవంత్ అభిమానులు. ఆఫీస్ లో అటెండర్ కు రేవంత్ ఇచ్చిన గౌరవం విమర్శకుల నోళ్లు మూయించింది అంటున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు రేవంత్..
రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు చాలామంది ఉద్యమకారులను రేవంత్ సన్మానించారు.ఉద్యమ నేత మల్లు స్వరాజ్యం తో సహా చాలామంది ఉద్యమనేతలను తెలంగాణ సిద్దించిన రోజు సన్మానించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక పక్క తెలంగాణ ఉద్యమకారులను సన్మానిస్తూ, మరో పక్క గాంధీభవన్ స్టాఫ్ కు రేవంత్ ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే తన వ్యూహం ఎంటో రేవంత్ చెప్పారు. ఏది ఏమైనా రేవంత్ ఆలోచనను, రేవంత్ గాంధీభవన్ ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన గౌరవాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం…