కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు చేస్తున్న సేవలకు గాను అభినందిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల తన వంతు సాయంగా బాదంపాలు, మజ్జిగను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి గాంధీ హాస్పిటల్లోని పారిశుద్ధ్య కార్మికులు శేఖర్ కమ్ములకు ప్లకార్డులతో థ్యాంక్ యు చెప్పారు. ఇదే విషయమై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ గాంధీ హాస్పిటల్లోని పారిశుద్ధ్య కార్మికులు థాంక్స్ చెప్పిన తీరు వెలకట్టలేనిది. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నాను. నేను చేసిన చిన్న పని మీకు నచ్చింది. కానీ ప్రతిరోజూ మీరు చేస్తున్న పని ముందు నేను చేసేది చాలా చిన్నదే అంటూ ట్వీట్ చేశాడు.
కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడుతున్న వారిలో డాక్టర్స్, పోలీసులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సంగతి తెలిసిందే.