కారోనా వైరస్ వ్యాప్తి, మరింత ఉదృతం అయితే పరిస్థితి పై మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.కరోన వైరస్ వ్యాప్తి మూడవ దశకి చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రతలపై సమీక్ష చేశారు. అవసరం అయితే గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోన హాస్పిటల్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.విదేశాల నుండి వచ్చిన వారిని,వారితో కలిసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని..సిబ్బంది కి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వవద్దని ఆదేశించారు.
వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే హాస్పిటల్స్, సిబ్బంది, వైద్య పరికారాలపై చర్చించారు. గాంధీ ఆసుపత్రి ని పూర్తిగా కరోనా చికిత్స కె వినియోగించేలా తయారు చేయాలని చెపారు. ఇప్పటికే గాంధీ లో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మిగతా అన్నీ విభాగలని కూడా తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని ఆదేశించారు. కింగ్ కోటి ఆసుపత్రి కూడా సిద్దంగా ఉంచాలన్నారు .
వీటితో పాటు అవసరం అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ ల సేవలు వినియోగించుకొనేందుకు కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి ఆద్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలియజేశారు.
పేషంట్ల సంఖ్య పెరిగితే ముందుగా అవసరం అయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్.. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని tsmidc ఎండి చంద్ర శేఖర్ రెడ్డి ని ఆదేశించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమన పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించిన మంత్రి, ఐసియూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని సూచించారు.
మూడవ దశలోకి వెళ్ళకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వెళ్లకూడదని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అయినా ముందు జాగ్రత్తగా అన్నీ సిద్దం చేసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా షట్ డౌన్ ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. పక్కన వారిని కలవకుండా ఉండడమే మనల్ని రక్షిస్తుంది అన్నారు.