ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది మ్యూజిక్. అన్ని పాటలు కూడా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా సినిమాలోని డైలాగులే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఊ అంటావా పాట జనాలకు బాగా చేరింది. సమంత పై చిత్రీకరించిన ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ పాటపై రీల్స్ కూడా చేస్తున్నారు. కొందరు సమంతను కాపీ కొడితే, మరికొందరు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తున్నారు.
అయితే ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారని అందరికీ తెలుసు. కానీ ఈ పాట రిహార్సల్ కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిందనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంతే కాదు ఈ పాటను నేరుగా చిత్రీకరించారు. ఈ విషయాన్నీ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్యనే చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆయన సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది, అల్లు అర్జున్ ఆ 2-3 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి అటువంటి పాట చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే నాకు రేపు క్యాటరాక్ట్ సర్జరీ ఉందని చెప్పాను. అప్పుడు నిర్మాత నా డాక్టర్‌తో మాట్లాడి తేదీని పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ నన్ను పిలిచి ఈ పాటకు కొరియోగ్రఫీ చేయమన్నారు.
కేవలం రెండు రోజులు రిహార్సల్ చేసి షూటింగ్ మొదలుపెట్టాం. సమంతకు తొలిసారి కొరియోగ్రఫీ చేశాను. నేను ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నానని ఆమెకు తెలియదు. కేవలం రెండు రోజులు రిహార్సల్ చేసి పాటకు న్యాయం చేశారు ఇద్దరూ కూడా అంటూ చెప్పుకొచ్చారు గణేష్ ఆచార్య.
Advertisements