ముంబై : గణేశ్ పండక్కి మన ఇల్లూ వాకిలిని ఎంతో అందంగా అలంకరించుకుంటాం. అంబానీ కుటుంబం కూడా అంతే! తన రేంజ్‌లో ఇంద్రభవనాన్ని మరింత గొప్పగా డెకరేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ డెకరేషన్ ఇప్పుడు పెద్ద ట్రెండై కూర్చుంది.
ముకేశ్ అంబానీ ఏటా ఏ పండగొచ్చినా ఇంటిని అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. ఎంతో వైభవంగా పండగలు జరుపుకొంటుంటారు. ఈ గణేశ్ చవితికి కూడా ఆయన ఇల్లు ‘ఆంటిలియా’ విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయింది. వీధి వీధంతా ఆ వెలుగులతో నిండిపోయింది. ఈ అలంకరణ ఖరీదే కోటి రూపాయిలు వుంటుందని అంటున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లకు ఈ వైభోగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
అంబానీ కుటుంబ సభ్యులకు ఈ వినాయక చవితి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ముకేశ్, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ పిరమాల్ వారసుడు ఆనంద్‌ను పెళ్లాడిన తర్వాత వచ్చిన తొలి పండగ ఇది. అంతే కాదు, ముకేశ్, నీతాల కుమారుడు ఆకాశ్ అంబానీ దంపతులకు కూడా ఇది తొలి వినాయక చవితి. ఆనంద్ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా చిన్న కూతురు శ్లోకను ఈమధ్యనే పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు జంటలతో అంబానీ కుటుంబం గణేశ్ చతుర్ధిని ఘనంగా జరుపుకుంటోంది. వారం రోజుల క్రితం అంబానీ కుటుంబం అత్యంత సన్నిహితుల్ని పండగకు ఆహ్వానించింది. అంబానీ దంపతులు డిజైన్ చేయించిన ఆహ్వాన పత్రిక కూడా ఎంతో ఘనంగా కనిపిస్తోంది.
https://www.instagram.com/tv/B16hR23nsNd/?utm_source=ig_web_button_share_sheet