హైదరాబాద్: హైదరాబాద్ అంటే గణేశ్ ఉత్సవాలకు ఫేమస్. వాడవాడలా భారీ విగ్రహాలు పెడతారు. భారీ ఊరేగింపులు జరిపి చివర్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనోత్సవాల్లో యూత్ అల్లరి సరే సరి.
ఐతే, నిమజ్జనం తర్వాత వినాయక సాగర్‌లో అసలు తంతు మొదలవుతుంది. విగ్రహాల శకలాల సేకరణ ఒక పెద్ద ఫార్స్. వాటిని స్టాక్ యార్డులకు తరలించే సీన్ చూస్తే దారుణంగా ఉంది. కాలితో విగ్రహాలను క్రేన్ నుంచి తోసి వేసే దృశ్యాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. నిమజ్జనం చేసిన విగ్రహాలను సేకరించి వాటికే మెరుగులు దిద్ది, మళ్లీ వచ్చే ఏడాది పూజలకు సిద్ధంగా ఉంచుతారు. ఇదీ తంతు.
అలా కాకుండా మట్టి విగ్రహాలు చేయిస్తే నిమజ్జనం తర్వాత నీళ్లలో కరిగిపోతాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో పాత విగ్రహాల తరలింపు దృశ్యాలు ఉండవు. మట్టి విగ్రహాలే వాడమని ఎన్ని సంవత్సరాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకునేది ?