చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదవశాత్తు నల్లమందు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ కి తీవ్ర గాయాలు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని వివరించారు.
ఈ ఘటనలో పోలీసు స్టేషన్ లోని కిటీకీ అద్దాలు, తలుపులు స్వల్పంగా దెబ్బతిన్నాయని తెలిపారు.ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. 2018 జూన్ లో జరిగిన ఓ కేసుకు సంబందించిన నల్లమందును సీజ్ చేసి నాశనం చేయడం జరిగింది. ఇందులో కొంత భాగాన్ని FSL కోసం ఉపయోగించిన నల్లమందును పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింది భాగంలో ఉంచి దానిపై కాంక్రీట్ వేశారు. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు మర్రి చెట్టు దగ్గర చిన్న పాటి పేలుడు సంబవించింది.
ఈ పేలుడులో పోలీస్ సిబ్బందికి, స్థానికులకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు స్వల్పంగా దెబ్బతింది.ఇది చాలా చిన్న పేలుడని ఎటువంటి వదంతులను నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు.సిఐ మద్దయ్యచారి, ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.