Advertisements
హైదరాబాద్ : ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి బెయిలొచ్చింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ తిరుపతి కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 42 కేసులలో అన్నింటికీ వివిధ కోర్టులు అతనికి బెయిల్ మంజూరు చేశాయి. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో కేంద్ర కారాగారం నుంచి కొల్లం గంగిరెడ్డి విడుదలయ్యాడు. టీడీపీ హయాంలో ప్రభుత్వం, పోలీసులు కళ్లుగప్పి గంగిరెడ్డి మలేసియాలో తలదాచుకున్నాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అతని మీద రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసింది. 2015 నవంబర్‌లో మలేసియాలో ఉన్న కొల్లం గంగిరెడ్డిని ఇండియాకు తీసుకొచ్చిన పోలీసులు ఏడాది పాటు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పీడీ యాక్ట్ గడువు ముగియడంతో ఇప్పుడు గంగిరెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాడు.