నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. “గోడ కనిపిస్తే చాలు ప్రతి ఒక్కడు అమరశిల్పి జక్కన్న అయిపోతున్నాడు” అని. సినిమా రిలీజ్ అయ్యిందో లేదో అందరు అదే పనిలో పడ్డారు.
ప్రియా, ప్రియా అంటూ ఎక్కడపడితే అక్కడ రాసేస్తున్నారు. అదే, వాళ్ళ వాళ్ళ ఫేస్ బుక్ గోడల మీద, సోషల్ మీడియా పేజీలలో ‘ప్రియా’ నామస్మరణలో మునిగిపోతున్నారు.
ప్రియా అరుళ్ మోహన్.. గ్యాంగ్ లీడర్ నానినే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులని కూడా చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేసింది. మొదటి సినిమా అయినా, తనకున్న థియేటర్ అనుభవంతో నానికి దీటుగా నటించింది.
అందానికి తోడు తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. తన మెడ మీద వున్న నక్షత్రాల టాటూలు కూడా బావున్నాయని అనుకుంటున్నారు. తాను రీసెంట్ గా తీసుకున్న ఫోటోషూట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.