యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.
అయితే మొదట ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి లో రిలీజ్ అని అనౌన్స్ చేయగానే చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. అందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటించిన గంగూభాయి ఖతియావాది కూడా ఒకటి.
బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాను ఫిబ్రవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా పెన్ స్టూడియోస్ వారు నిర్మించారు.