ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన అలియా భట్ గంగూబాయి కతియావాడి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని మంచి వసూళ్ళను సాధిస్తుంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది.
విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ ను దాటేసింది. రెండో వారంలో కూడా ఈ సినిమా జోరు మీదుంది. అయితే, ఈసారి ది బ్యాట్‌మ్యాన్ నుండి పోటీ ఎదురైంది.
ఇదే విషయాన్ని చెబుతూ గంగూబాయి బాక్సాఫీస్ కలెక్షన్ గురించి ట్వీట్ చేశారు తరణ్ ఆదర్శ్. గంగూబాయి కి ది బ్యాట్‌మ్యాన్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ రెండవ శని, ఆదివారాలు కలెక్షన్స్ పెరుగుతాయని ట్వీట్ చేశారు. రెండవ శుక్రవారం దాదాపు 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే మొత్తం ఇండియా వైడ్ 73.94 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు అంటూ చెప్పుకొచ్చారు తరుణ్ ఆదర్శ్.
ఈ సినిమాలో అలియా భట్‌తో పాటు, అజయ్ దేవగన్, పార్థ్ సమతాన్, శంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రలలో నటించారు.
#GangubaiKathiawadi commences Week 2 on a strong note, despite facing stiff competition from #TheBatman in #Mumbai and #Delhi… Biz expected to grow on [second] Sat and Sun… [Week 2] Fri 5.01 cr. Total: ₹ 73.94 cr. #India biz. pic.twitter.com/soP8DvMKnZ
— taran adarsh (@taran_adarsh) March 5, 2022
Advertisements