ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ తరఫున ఆడుతున్న స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ చెలరేగిపోతున్నాడు. పదునైన పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. వేగవంతమైన బౌలింగ్‌తోపాటు టీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ బౌలర్‌పై తాజాగా బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అద్భుతంగా రాణిస్తున్నట్లు చెప్పారు. ఉమ్రాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నట్లు తెలిపారు. అతడి బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు.
అలాగే, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కూడా రాణిస్తున్నారని ఆయన అన్నారు. అయితే, అందరి కంటే ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలో హైలైట్‌గా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. తాను కూడా ఐపీఎల్ టోర్నీని చాలా ఆసక్తితో చూస్తున్నానని గంగూలీ అన్నారు.
ప్రస్తుత సీజన్‌లో అన్ని జట్లూ అద్భుతంగా ఆడుతున్నాయని, గెలిచే అవకాశాలు అన్ని జట్లకూ ఉన్నాయని గంగూలీ చెప్పారు. ముఖ్యంగా గుజరాత్, లక్నో కొత్త జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయని ఆయన తెలిపారు.