మేడ్చల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి.పి.ఆర్ స్కూల్ వద్ద అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.పేకాట స్థావరాల డబ్బు విషయంలో గొడవ మొదలు కాగా కళ్లలో కారం చల్లి కర్రలు,రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘటన లో మణికంఠ,శ్రీహరి అనే వ్యక్తుల పరిస్థితి విషమంగా మారింది. వారిని సురారం మల్లారెడ్డి హస్పిటల్ కి తరలించారు. అలాగే ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… నగర శివారులలో పలు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్న షాపూర్ కి చెందిన రాము,రాంరెడ్డి నగర్ కి చెందిన రమేష్ కు డబ్బు చెల్లించాల్సి ఉంది. రమేష్ కి ఎలాగైన డబ్బు ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో రాముకి ఫోన్ చేసి మణికంఠ సవాల్ విసిరాడు.
అయితే డిపి ఆర్ స్కూల్ వద్దకు రమ్మని రాము చెప్పడంతో మణికంఠ 6మంది స్నేహితులతో అక్కడికి వెళ్లాడు. అప్పటికే రాము 20మందితో గస్తీ కాసి ఉన్నాడు. మణికంఠ తన స్నేహితులతో అక్కడికి చేరుకోగానే కళ్లలో కారం చల్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడి లో పలువురు గాయపడ్డారు.