మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిసారిగా 2019లో గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత కరోనా కారణంగా ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఏపీలో అన్ని సినిమా హాళ్లలో 50% ఆక్యుపెన్సీని అమలు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులను గతంలో జారీ చేశారు. అలాగే టిక్కెట్ ధరలకు సంబంధించి జిఓను ను విడుదల చేశారు. కాగా ఇప్పుడు వాటిని సవరించాలని ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ గని టీం మాత్రం డేర్ స్టెప్ తీసుకుంది. ఫిబ్రవరి 25న థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. సిద్దు ముద్దా అల్లుబాబి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమాతో గని ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.