కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. అల్లు బాబి, సిద్దు ముద్ద ఈ సినిమాను నిర్మించారు.
అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే గని పంచ్ పార్టీ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఆ వీడియో లో టీమ్ అంతా ఒకచోట కూర్చుని పంచ్ లు వేస్తూ చిల్ అయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు విడుదల చేశారు.
జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్ లు హోస్ట్ గా చేసిన ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఫుల్ వీడియోని త్వరలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.