మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ను ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
నిజానికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఉండటం తో రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు.
ఇక ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
రినైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Mega Prince @IAmVarunTej's #Ghani is all set to hit the screens on 𝐀𝐏𝐑𝐈𝐋 𝟖𝐭𝐡! 🥊#GhaniFromApril8th 🤩@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/IFnZNDWBSt
— Geetha Arts (@GeethaArts) March 2, 2022
Advertisements