వరుణ్ తేజ్ నటించిన గని షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా చిత్రాలు మాదిరిగానే, గని విడుదల కూడా చాలాసార్లు వాయిదా పడింది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందట.
ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి, ఇతర చిత్రాల విడుదల షెడ్యూల్‌ను బట్టి, గని సినిమాను ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు మేకర్స్.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.