డిఫరెంట్ కథలతో వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమాను జూలై 30వ తేదీన థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. మరోవైపు ఉపేంద్ర ,సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి గని హిట్ కొడతాడో లేదో చూడాలి.