– దమ్ మారో దమ్ అంటూ చిందులు
– రోజూ దొరికినా..అదే రేంజ్ లో దందా!
– ఏడేళ్ల పాలనలో..మత్తుకు చిత్తయ్యారా!
– అక్రమ రవాణా,సాగు అడ్డుకోలేరా!
– పోలీసుల శ్రమ ఎక్కువ..పట్టుబడేది తక్కువ
– సారాయిలా..గంజాయిని కంట్రోల్ చేయలేరా?
దమ్ మారో దమ్ అంటూ..ఒక్కసారైనా గంజాయి తాగాలనే టీనేజర్స్ కోరికతో జీవితమే చిత్తువుతోంది.మద్యం మత్తులో ఒక్కసారి రుచి చూసిన తర్వాత..మళ్లీ మళ్లీ కావాలనే కోరిక పెంచి బానిసగా చేయడమే గంజాయికి ఉన్న పవర్.దీంతో అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.ఇక..ఇదే డిమాండ్ ని ఆసరాగా చేసుకుని గంజాయి మాఫియా రంగంలోకి దిగుతోంది.యువతను మత్తులో మరింత చిత్తు చేసి..ఊబిలో దింపుతోంది. దట్టమైన అడవి నుంచి గచ్చిబౌలిలో అపార్ట్ మెంట్స్ వరకు గంజాయిని ఒక పంటలాగా సాగుచేస్తున్నారంటే,మత్తు ఎంతలా నషాళానికి ఎక్కిందో చెప్పనక్కర్లేదు.ఒక్కసారి తాగితే 12గంటల పాటు నరాలన్ని జివ్వుమంటూ మరోలోకాని తీసుకెళ్లినట్లు మైమరిపించే ఈమహమ్మారిని తరిమేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తెలంగాణలోమద్యం ఏరులై పారుతుంటే..తక్కువ ధరలో ఎక్కువ కిక్కు ఇచ్చి ఆరోగ్యాన్ని పాడుచేసే గంజాయి మరిచిపోయేందుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింగరేణి కాలనీ ఘటన తర్వాతే కళ్లు తెరిచిన ప్రభుత్వం !
అభం శుభం తెలియని 7యేళ్ల బాలిక పై గంజాయి మత్తులో అత్యాచారం,హత్య ఘటన ఆ తర్వాత నిందితుడు రైల్ పట్టాల పై ఆత్మహత్య కథనం..దీంతో ప్రజల్లో ఉద్యమం ఊపందుకుంది. ఉడ్ తా పంజాబ్ లాగా..ఉడ్ తా తెలంగాణ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి . దీంతో గంజాయితో పోలీసులు, ఎక్సైజ్ శాఖ రెండూ కుస్తీ పట్టాయి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో పండే పంట హైదరాబాద్ లో అరాచాకాలకు దారి తీస్తుందని గుర్తించారు.ఆపడం ఈజీ అనుకున్నా..రోజురోజుకు గంజాయి మాఫియా పోలీసులకు సవాలు విసురుతునే ఉంది. టన్నుల కొద్ది రవాణా అవుతుంటే..డిపార్ట్ మెంట్ పట్టుకునేది కిలోలు మాత్రమే.
ఓ యువతా మేలుకో..!
గంజాయికి అలవాటు పడితె జిందగీ మొత్తం నాశనం అయినట్టె. సరదాగా మొదలువెట్టినా అది వ్యసనంగా మారుతుంది.పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ వ్యసనం బారిన పడుతున్నవాళ్లలో..ఎక్కువ మంది కాలేజ్ కుర్రకారే ఉన్నారు. టైం పాస్ కోసం అంటూ చెప్తున్నారు.అటు..కొన్నిసార్లు పట్టుబడ్డా విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని..కొన్ని సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.రోజు పట్టుబడుతున్నా.. రవాణా అగడం లేదు.. కాస్త ప్రయత్నిస్తే సామాన్యుడికి కూడా ఇంకా అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో వాడకంలో ఉన్న గంజాయిని 35 యేళ్ల క్రితమే నిషేధిత వస్తువుల్లో చేర్చారు. చట్టాలు ఇప్పుడు కఠినంగా అమలవుతుండటంతో.. గంజాయి జోలికి వెళ్లితే జీవితం చిందరవందరే అవుతుంది .
మరిన్ని వివరాలు..పార్ట్ – 2లో