సీఎం జగన్ చేసిన ప్రపొజల్‌కు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే గంటా బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో… గంటా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
అసెంబ్లీలో సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని… పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని ప్రకటించటంపై గంటా హార్షం వ్యక్తం చేశారు. విశాఖకు రోడ్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ ఉందని… కాస్మో మెట్రో నగరంగా పరిపాలన కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతుందని అన్నారు.
సీఎం శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, విశాఖను పరిపాలన కేంద్రం చేయటం మంచి నిర్ణయం అంటూ కొనియాడారు. ఇప్పుడీ ప్రకటన టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం అవుతుంది. టీడీపీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో… గంటా ప్రకటన చర్చనీయాంశం అవుతోంది.