విశాఖ: వైజాగ్ పాలిటిక్స్‌కు సెగ తగిలింది. ఇద్దరు శీనుల మధ్య రాజకీయ రచ్చ రగిలింది.! ముందు ‘గంటా’ మోగించింది అవంతి. ఇప్పుడు ఆ మోత రీసౌండ్ వస్తోంది.
మేటరేంటంటే.. మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ రగడ ఇప్పటిది కాదు. అదిప్పుడు ముదిరిపాకాన పడింది. ఇద్దరి మధ్యా రాజకీయం రసకందాయానికి చేరుకుంది. గంటా వైసీపీ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయని ఆమధ్య ఎప్పుడో అవంతి కామెంట్ విసిరారు. దానికి గంటా విజయనగరంలో రియాక్టవుతూ, అవంతిని అసలు మంత్రిగానే చూడ్డం లేదని సెటైర్ వేశారు. అవంతి ఊరుకుంటారా? ‘నెల్లూరు మెస్‌లో టిక్కెట్లు అమ్మిన ఘన చరిత్ర గుర్తు లేదా బ్రదర్.. అంటూ గంటాకు కౌంటరిచ్చారు.
గంటా ఇంటిపోరు పడలేక అవంతి టీడీపీ నుంచి వెళ్లిపోయారు. గత ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి విజయం సాధించారు. తరువాత అవంతి జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. మంత్రిగా మారి అవంతి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతుడటం గంటాకు ఇరిటేషన్ తెప్పిస్తోందని సమాచారం. ఇటీవల ఆయన వైసీపీలో చేరాలని ఫిక్సయినప్పుడు అవంతి అడ్డుపడ్డారని సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలో ఎలా చేరతారని జగన్ దగ్గర ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అందువల్లనే గంటా ఎంట్రీ జరగలేదని అంటారు. ఒకవేళ తను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరని గంటా ఇటీవల విజయనగరం పర్యటనలో పరోక్షంగా అవంతిని ఉద్దేశించి మాట్లాడారు. అవంతిని అసలు మంత్రిగానే గుర్తించడం లేదని అనేశారు.
గంటా ఒక్కటంటే నేను రెండంటా.. అంటూ మంత్రి అవంతి ఇప్పుడు తన ప్రత్యర్ధి హిస్టరీ తవ్వేశారు. గతంలో గంటా శ్రీనివాసరావు నెల్లూరు మెస్‌లో టోకెన్లు అమ్మారని, నమ్మిన వారిని వంచించి పైకి వచ్చిన ఘన చరిత్ర ఆయనదని మంత్రి అవంతి శ్రీనివాసరావు దుమ్మెత్తిపోశారు. గంటా గాలి తీసేశారు. తాను మంత్రినే కాదంటే గంటా అసలు మనిషే కాదని అవంతి ఫైరింగ్. గంటా జీవితమంతా మోసం, దగా, కుట్రలే అంటూ, నేను అయ్యన్నపాత్రుడిలా… అంత మంచి వాడిని కాదు సుమా… అంటూ మంత్రి అవంతి వార్నింగ్…!! ఇద్దరు శీనయ్యల వార్ చివరకు ఏమలుపు తిరుగుతుందో చూడాలి..!