యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సాయి పల్లవి.. గ్లామర్‌కు అతీతంగా నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. ఇటీవలే ‘విరాటపర్వం’తో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయిపల్లవి నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇఫ్పుడు ఈ క్రేజీ యాక్ట్రెస్ సినిమా ‘గార్గి’ రిలీజ్ కు సిద్ధమైంది.
యాత్రి’ అంటూ సాగే పస్ట్ సింగిల్‌ను మంగళవారం రాత్రి 7గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతికలు ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం జూలై 15న తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
గార్గీ అంటే పురాణాల్లోని ఓ క్యారెక్టర్. ఒక సమయంలో పురుషుడికి పవర్, అవకాశాలు ఉన్నాయనే భావన ఉండేది. సమకాలీన సమయంలో మహిళలకు కూడా సమాన భాగం ఉండే ఒక వెసులుబాటు ఉంటుంది.
కాగా, ఈ కథలో గార్గీ పాత్రకు కూడా అలానే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో నేను టీచర్ పాత్రను పోషించానని,.. టీచర్ ఎలా ఉంటుందనే కాకుండా కుటుంబంలో ఉండే సమస్య గురించి కథ ఎక్కువగా ట్రావెల్ అవుతుందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఎస్‌పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.